బంతిని కేసీఆర్ కోర్టులోకి నెట్టిన డీఎస్

డీఎస్ బంతి సీఎం కేసీఆర్ కోర్టులో వచ్చిపడింది. డీఎస్ ని పార్టీ నుంచి బహిష్కరించాలని నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ ని విజ్ఝప్తి కూడా చేశారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డీఎస్ తనయుడు అరవింద్ బీజేపీలో
చేరడం.. ఎంపీ కవితని టార్గెట్ చేయడం టీఆర్ఎస్ శ్రేణులకు రుచించడం లేదు. దీని వెనక డీఎస్ హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.

డీఎస్ పై వచ్చిన ఆరోపణలని సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకొన్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు డీఎస్ ప్రయత్నించినా.. అపార్ట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన డీఎస్ స్వతంత్రంగా పార్టీని వీడుతారని అందరు భావించారు. ఐతే, రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన డీఎస్.. బంతిని కేసీఆర్ కోర్టులోకి నెట్టినట్టు తెలిసింది.

సోమవారం డీఎస్ తన నియోజకవర్గం ధర్మపురి చెందిన కొందరు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఓ హోటల్ లో అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరిగింది. టీఆర్ఎస్‌తో తాడోపేడో తేల్చుకునేందుకే ఈ సమావేశం నిర్వహించి ఉంటారని అనుకొన్నారు. ఐతే, ఇక్కడ డీఎస్ తన రాజకీయ చతురతని చూపారు. ఇప్పుడే టీఆర్ ఎస్ ని వీడే ఆలోచన లేదని డీఎస్ తేల్చి చెప్పారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించిన తర్వాత నిర్ణయం తీసుకొందామని చెప్పినట్టుగా తెలుస్తోంది.

అదే సమయంలో తనకు కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చిందని కార్యకర్తలకు సూచన ప్రాయంగా చెప్పారట. మొత్తానికి.. డీఎస్ బంతి ఇప్పుడు సీఎం కేసీఆర్ కోర్టులోనే ఉంది. ఆ బంతిని కేసీఆర్ బయటకు తత్తారా.. ? లేదా టీఆర్ ఎస్ కోర్టులోనే కొనసాగేలా చర్యలు తీసుకొంటాడా ?? అనేది చూడాలి.