తెలంగాణ సాస్కృతిక సార‌థికి హైకోర్టు షాక్…!!

\

తెలంగాణ సాంస్కృతిక సారధికి హై కోర్టు షాక్ ఇచ్చింది. సాంస్కృతిక సార‌థిలో నియామ‌కాల‌ను స‌వాల్ చేస్తూ కొంత‌మంది హైకోర్టును ఆశ్రయించారు. పిటీష‌న్ ను స్వీక‌రించిన హైకోర్టు తీర్పు వెల్ల‌డించింది. సాంస్కృతిక సార‌థిలో నియామ‌కాలు పార‌ద‌ర్శ‌కంగా లేవ‌ని కోర్టు మొట్టికాయ‌లు వేసింది. రాజ్యాంగ‌బ‌ద్దంగా లేవ‌న్న పిటీష‌న‌ర్ల వాద‌న‌ను స‌మ‌ర్థించింది. మ‌ళ్లీనియామ‌కాలు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశించింది. ఇప్ప‌టికే 550 నియామకాలు చేప‌ట్టిన నేప‌థ్యంలో వాటిని ర‌ద్దు చేసి మ‌ళ్లీ నియామ‌కాలు చేప‌ట్టాలంది హైకోర్టు. రెండు వారాల్లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి, మూడు వారాల్లో నియామ‌కాలు చేప‌ట్టాలని సూచించింది.