‘MNJ కేన్సర్‌ ఆసుపత్రిలో పోస్టుల భర్తీ’కి ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ MNJ కేన్సర్‌ ఆసుపత్రిలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 209 వైద్యుల పోస్టులు, 173 పారామెడికల్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుపతినిచ్చింది. వీటిలో 173 పారామెడికల్‌ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా, 36 వైద్యుల పోస్టులను డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించింది.

173 పారామెడికల్‌ పోస్టుల్లో 85 స్టాఫ్‌ నర్సు పోస్టులు, 16 ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 10 ల్యాబ్‌ అటెండెంట్, 10 థియేటర్‌ అటెండెంట్, 10 రేడియోగ్రాఫర్‌ గ్రేడ్‌–2 పోస్టులున్నాయి. 36 వైద్యుల పోస్టుల్లో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సీనియర్‌ రెసిడెంట్, బ్లడ్‌ బ్యాంక్‌ ఆఫీసర్, లెక్చరర్‌ పోస్టులున్నాయి.