అమితాబ్ సినిమాలో నాగ్.. కీలకమట !

టాలీవుడ్ కింగ్ నాగార్జున బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘బహ్మస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాగార్జునని తీసుకొన్నారు. త్వరలో ముంబైలో జరగనున్న షెడ్యూల్ లో నాగ్ పాల్గొనబోతున్నాడు. కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

2003లో వచ్చిన ‘ఎల్‌వోసీ కార్గిల్‌’ సినిమా తర్వాత నాగ్ మళ్లీ బాలీవుడ్ లో కనిపించలేదు. అంతకంటే ముందు ఖుదా గవా, క్రిమినల్‌, జక్మ్‌ తదితర చిత్రాల్లో నటించారు. ఐతే, గత కొన్నాళ్లుగా మళ్లీ బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచేందుకు నాగ్ ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన ‘బ్రహ్మస్త’ ఆఫర్ ని ఆయన ఓకే చేశారు.

ప్రస్తుతం తెలుగులో నాగ్ ‘దేవదాస్’ సినిమాతో బిజీగా ఉ న్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రమిది. నాగ్ తో కలిసి యంగ్ హీరో నాని తెరని పంచుకోనున్నాడు. ఇందులో నాగ్ గ్యాంగ్ స్టర్ గా, నాని డాక్టర్ గా కనిపించబోతున్నారు. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మంద్న జతకట్టనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టైటిల్ కు మంచి స్పందన వస్తోంది.