‘జమిలి’కి వైసీపీ ఓకే ?!
దేశంలో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ నినాదం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ‘జమిలి’ ఎన్నికలపై విస్తృత చర్చ జరుగుతోంది. దీనిపై ఏర్పాటైన లా కమిషన్ దేశంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలని తీసుకొనే పనిలో ఉంది. లా కమిషన్ ముందు శనివారం 9 పార్టీలు, ఆదివారం 7 పార్టీలు హాజరయ్యాయి. జమిలి ఎన్నికలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ జమిలికి అంగీకారం తెలిపింది.
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేష్ అధికార పార్టీ టీడీపీ ముందస్తుని వ్యతిరేకించినా.. జమిలిపై పెద్దగా వ్యతిరేకతని తెలపడం లేదు. ఇక, జాతీయ పార్టీలు బీజేపీ తన నిర్ణయాన్ని తెలపడానికి నెలరోజుల గడువు కోరింది. కాంగ్రెస్ అంత సుముఖంగా లేదు. డీఎంకె, సీపీఎం, సీపీఐ.. జమిలి ఎన్నికలని పూర్తిగా వ్యతిరేస్తున్నాయి.
తాజాగా, వైసీపీ మరికొద్దిసేపటిలో లా కమిషన్ ముందు హాజరుకాబోతుంది. ఆ పార్టీ నేతలు విజయ్ సాయి రెడ్డి, ఉమ్మారెడ్డి కమిషన్ ముందుకు వెళ్లనున్నారు. జమిలి ఎన్నికలపై తమ పార్టీ అభిప్రాయాన్ని తెలిపనున్నారు. ఐతే, జమిలికి వైసీపీ ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉ న్నట్టు కనబడుతోంది. అదే నిజమైతే.. కేంద్ర స్థాయిలో టీఆర్ ఎస్, వైసీపీ అనుసరించే విధానాలు ఒకేలా ఉంటున్నాయని చెప్పవచ్చు.