ఎంఐఎం నేత‌ల‌ను ఎందుకు అరెస్టు చేయ‌లేదు..!?

పరిపూర్ణానంద స్వామిని 6 నెల‌ల‌పాటు నగర బహిష్కరణపై బీజేపీ నేత‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ వైఖ‌రిని తీవ్రంగా ఖండించారు. ఒక సాధువును ఇలా చేయ‌డం స‌మ‌ర్థ‌నీయం కాద‌ని కేంద్ర మాజీ మంత్రి ద‌త్తాత్రేయ అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణ ప్ర‌భుత్వం హిందువులకు వ్య‌తిరేకంగా పని చేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

అధికార దుర్వినియోగం చేస్తూ స్వామిజిని గృహ నిర్బంధం చేశారని బీజేపీ నేత కిష‌న్ రెడ్డి ఆరోపించారు. నగర బహిష్కరణ అని చెప్పి తెలంగాణ బహిష్కరణ చేశారని ఆరోపించారాయ‌న‌. విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని, వివక్షత తో స్వామిజిని కాకినాడ వరకు తరలించారని చెప్పారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఎంఐఎం నేతలను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు.