తనని ‘ముద్దు’లోకి దించాలని చూస్తున్నారు

హీరోయిన్ కీర్తి సురేష్ ని ‘ముద్దు’లోకి దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇన్నాళ్లు ఈ ముద్దుగుమ్మ తెరమీద, తెర వెనక పద్దతిగా కనిపించింది. ఎప్పుడు శృతిమించలేదు. నిండుతనం చూపించింది. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ కీర్తి అమాంతం పెరిగిపోయింది. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఐతే, వచ్చే ఆఫర్లలో ఎక్కువ మంది ముద్దు సన్నివేశాలలో నటించమని అడుగుతున్నారట. అలాంటి సన్నివేశాలలో నటించనని గతంలో చాలాసార్లు చెప్పింది. అయినా.. కీర్తిని ‘ముద్దు’లోకి దించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించేలా లేవు. ఎందుకంటే ముద్దులు వద్దని కీర్తి తేల్చి చెప్పేసింది. రామ్ ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత కోలీవుడ్ లోనూ క్రేజ్ ని సంపాందించుకొంది. తిరిగొచ్చి తెలుగులో నేను లోకల్, అజ్ఝాతవాసి సినిమాలు చేసింది. ‘మహానటి’తో గొప్ప నటి అనిపించుకొంది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఏ సినిమా పడితే.. ఆ సినిమా చేయాలని అనుకోవడం లేదు. కథల ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తోంది. మంచి కథల కోసం వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం కీర్తి తమిళంలో విజయ్, విక్రమ్ సినిమాలతో నటిస్తోంది.

ఇదీగాక, కీర్తి సురేష్ మరోసారి మహానటిగా కనిపించబోతుందని చెప్పుకొంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో సావిత్రి పాత్ర కోసం మళ్లీ కీర్తి సురేష్ నే తీసుకొన్నట్టు తెలిసింది. ఈ బయోపిక్ లో బాలీవుడ్ నటి విద్యాబాలన్, మహేష్ బాబు, నాగచైతన్య, రానా దగ్గుపాటి.. తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.