రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న సోమారపు..!!
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని మంత్రి కేటీఆర్ నచ్చజెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. సీనియర్ నాయకులు పార్టీకి అవసరమంటూ కేటీఆర్ బుజ్జగించారు. అన్యాయం జరిగిందని రాజకీయ సన్యాసం అన్నారు గాని.. పార్టీని విమర్శించని గొప్ప వ్యక్తి సోమరపు సత్యనారాయణ అని కేటీఆర్ ప్రశంసించారు.
కేటీఆర్ అభ్యర్థనతో రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ఉపసంహ రించుకున్నారు సోమారపు. స్థానికంగా పార్టీలో అలజడి కారణంతో ఈ వయసులో రాజకీయాలు వద్దనుకున్నానని, తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ తపన పడుతున్నారని సోమారపు సత్యనారాయణ అన్నారు. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కి ఒక సివిల్ ఇంజనీర్ లాంటి వారని కొనియాడారు. మొత్తంగా కేటీఆర్ రంగంలోకి దిగడంతో రాజకీయ సన్యాసంపై సోమారపు సత్యనారాయణ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.