ఇదిగో.. మా హీరోయిన్స్ వచ్చేశారు !

అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో వెంకీ-వరుణ్ తేజ్’ల మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ముందు వరుణ్, ఆ తర్వాత వెంకీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్స్ కూడా వచ్చేశారు. వెంకీకి జంటగా తమన్నా, వరుణ్ కి జంటగా మెహ్రీన్ జతకట్టనున్నారు. ఈ రెండు జంటలు కలిసి షూటింగ్ స్పాట్ లో దిగిన ఫోటో ఒకటి చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో వెంకీ-వరుణ్ లు తోడల్లుళ్లుగా కనిపించబోతున్నట్టు తెలిసింది. వీరిలో ఒకరు ఫన్ ని పంచితే, మరొకరు ప్రస్టేషన్ ని చూపిస్తారట. దర్శకుడు అనిల్ రాఘవపూడి సినిమాలు ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి. ఐతే, ఎఫ్ 2లో కామెడీ డోస్ ఇంకాస్త ఎక్కువగానే ఉండనుందని చెబుతున్నారు.ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్. దిల్ రాజు నిర్మాత. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ‘ఎఫ్ 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.