‘వెంకీ మామ’ మొదలైంది..
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల జోరు మొదలైంది. ఇప్పటికే నాగ్-నానిల మల్టీస్టారర్ ‘దేవదాస్’, వెంకీ-వరుణ్ తేజ్’ల ‘ఎఫ్ 2’ సెట్స్ మీదకు వెళ్లాయి. తాజాగా, వెంకీ, నాగ చైతన్యల మల్టీస్టారర్ మొదలైంది. ఈ ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ మల్టీస్టారర్ కు బాబీ దర్శకుడు. ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ తర్వాత బాబీ చేస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ‘వెంకీ మామ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. వెంకీ హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం వెంకీ వరుణ్ తో కలిసి ‘ఎఫ్ 2’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. మరోవైపు, చైతూ సవ్యసాచి, శైలాజా రెడ్డి అల్లుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు నెల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇవి పూర్తయిన వెంటనే మరో రెండు సినిమాలతో చైతూ బిజీకానున్నాడు. ఇందులో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఒకటి. ఈ సినిమా కోసం చైతూ-సమంత జతకట్టనున్నారు. దీంతో పాటు ‘వెంకీ మామ’ని పూర్తి చేయనున్నాడు.