కాంగ్రెస్ లో చేరిన కిరణ్..!
ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి,మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారాయన. కాంగ్రెస్ తో తనది విడదీయరాని బంధమని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ ను బలపర్చాల్సిన సమయమిదని, విభజన హామీలు కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు కిరణ్.
విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం వైఫ్యలం చెందిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ లు కూడా విభజన హామీలు సాధించుకోవడంలో విఫలమయ్యాయని అన్నారు. విభజన హామీలు సమర్థనీయంగా కాంగ్రెస్ అమలు చేయడం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ తోనే దేశానికి సరికొత్త దశ, దిశ వస్తుందని ఆయన చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ లో 30 నుంచి 40మంది నేతలు చేరతారని చెప్పారు కిరణ్. కాంగ్రెస్ ఏ పదవి ఇచ్చినా తాను నిర్వర్తిస్తానని అన్నారాయన. రాహుల్ ను కలిసిన వారిలో ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, పల్లంరాజు ఇతర నేతలు ఉన్నారు.