రివ్యూ : చినబాబు

చిత్రం : చినబాబు (2018)
నటీనటులు : కార్తీ, సయేషా
సంగీతం : డి ఇమాన్‌
దర్శకత్వం : పాండిరాజ్‌
నిర్మాత : సూర్య
రిలీజ్ డేటు : 12 జులై, 2018.
రేటింగ్ : 2.5/5

తమిళ్ స్టార్ కార్తీ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ ఉంటుంది. ఆయన తాజా చిత్రం ‘ కడైకుట్టి సింగం’. కార్తీకి జంటగా సయేషా నటించింది. పాండిరాజ్ దర్శకుడు. కార్తీ అన్నయ్య హీరో సూర్య నిర్మించారు. కార్తీ రైతుగా మారి చేసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘చినబాబు’ తీసుకొచ్చారు. టీజర్, ట్రైలర్ లో రైతుగా కార్తీ బాగా సూటయ్యాడని అనిపిచింది. ఈ నేపథ్యంలో ‘చినబాబు’ పెద్ద అంచాలతో ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. మరీ.. చినబాబు ఎలా ఉన్నాడు ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాడు ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్‌) రైతు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు. ఒక్కడే కొడుకు కృష్ణం రాజు (కార్తీ) కూడా రైతే. అందరికంటే చిన్నవాడు. డాక్టర్, లాయర్, కలెక్టర్, ఇంజనీర్ అని అంతా ఎలా గొప్పగా చెప్పుకుంటారో…. తాను రైతును అని గర్వంగా చెప్పుకునే వ్యక్తి. అదే ఊర్లో రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న సురేంద్ర రాజు (శత్రు) ను ఓ హత్యకేసులో కృష్ణం రాజు జైలుకు పంపిస్తాడు.

అప్పటికే తమ కూతురును తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయాలని కార్తీ ఇద్దరు అక్కలు ఆశపడతారు. ఐతే, కృష్ణం రాజు మరొక అమ్మాయి (సాయేషా సైగల్)ని ప్రేమించడంతో ఫ్యామిలీలో గొడవలు మొదలవుతాయి. చివరకు కుటంబం చీలి పోయే పరిస్థితి వస్తుంది. ఈ పరిణామాలను ఆసరా చేసుకొని సురేంద్ర రాజు కృష్ణంరాజుపై పగ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. వీటిన్నంటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

* కార్తి, సత్యరాజ్ ల నటన

* రైతు గొప్పదనం గురించి చెప్పే ఎపిసోడ్

మైనస్ పాయింట్స్ :

* కథలో కొత్తదనం లేకపోవడం

* ఫ్యామిలీ డ్రామాను మరీ సాగదీయడం

ఎవరెలా చేశారంటే ?

కార్తీని పల్లెటూరు రైతు బిడ్డగా చక్కగా చూపించారు దర్శకుడు పాండిరాజ్. అదే సమయంలో కార్తీ నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీ, రొమాన్స్, యాక్షన్ లో లోటు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఐతే, సినిమాలో తమిళ వాసన ఎక్కువైంది. దీంతో తెలుగు ప్రేక్షకుడు అంత ఈజీగా కథకి కనెక్ట్ అవ్వలేడు. రైతు పాత్రల్లో కార్తి నటన చాలా బాగుంది. రైతు స్టయిల్ లోనె యాక్షన్, రొమాంటిక్ సీన్స్ ని పండించాడు. ఫ్యామిలీలో గొడవలు వచ్చినపుడు అనుబంధాలు విడిపోకుండా, వారిని కలిపేందుకు కార్తి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులని ఆకట్టుకొనేలా ఉన్నాయి.

సయేషాది హీరోయిన్ పాత్ర అనడం కంటే అతిథి పాత్ర అనడం బెటర్. ఉన్నంతలో బాగానే చేసింది. పల్లెటూరి అమ్మాయిగానూ మెప్పించింది. హీరో తండ్రి, కుటు కుటుంబ పెద్దగా సత్యరాజ్‌ హుందాగా కనిపించారు. తెలుగులో సపోర్టింగ్ రోల్స్‌ లో కనిపించిన శత్రుకు ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా అవకాశం దక్కింది. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైన చేసే పాత్రలో శత్రు మంచి విలనిజం పండించాడు. మిగితా కుటుంబ సభ్యుల పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.

సాంకేతికంగా :

వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బావుంది. విలేజ్ అందాలను తన కెమెరాలో చాలా బాగా చూపించాడు. డి ఇమ్మాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. రుబన్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బావుండేది. అక్కడక్కడ కొన్ని సీన్స్ బోరింగ్ అనిపించాయి.

బాటమ్ లైన్ : ‘చినబాబు’లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ

రేటింగ్ : 2.5/5