లారెన్స్’తో శ్రీరెడ్డి.. హోటల్ రూం సీన్ లీకు !

శ్రీరెడ్డి లీక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్ విషయంలో శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతితెలిసిందే. ఇన్నాళ్లు టాలీవుడ్ ప్రముఖులని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. ఇప్పుడు కోలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది. గురువారం దర్శకుడు మురగదాస్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసింది. మీరూ… గొప్పవారే సర్ అంటూ తన ఫేస్ బుక్ పేజీలో రాసుకొచ్చింది. దీంతో శ్రీ రెడ్డి లిస్టులో మురగదాస్ కూడా ఉన్నాడనే విషయం బయటపడింది. తాజాగా, ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. లారెన్స్ అసలు రంగు ఇదంటూ.. తనని వాడుకొన్న ఓ హోటల్ సీన్ ని ఊసగుచ్చినట్టు వివరించింది.

‘ఓ రోజు తాను తన స్నేహితుల ద్వారా గోల్కొండ హోటల్‌లో లారెన్స్ మాస్టర్ కలుసుకొన్నా. తనని లారెన్స్ హోటల్ రూమ్ కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూశా. నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొత్తవారికి సాయం చేయాలనే తపన తనలో ఉందని తనతో చెప్పాడు లారెన్స్. ఆయన చాలామంది అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించిన విషయం కూడా నాకు బాగా నచ్చింది. ఐతే, ఆ తర్వాతే అసలు రంగు బయటపడింది’ అంటూ అసలు తంతు చెప్పుకొచ్చింది.

మొదట లారెన్స్ నన్ను బొడ్డు, నడుము చూపించమన్నాడు. అద్దం ఎదురుగా రొమాంటిక్ డాన్స్ చేయమన్నాడు. ఆ తర్వాత నాతో రొమాన్స్ మొదలు పెట్టాడు. నా సినిమాలో నీకు ఆఫర్ పక్కా అన్నాడు. ఆ తరువాత అతడితో కొంతకాలం ఫ్రెండ్ షిప్ చేశాను. వాడుకొన్నాడు. కానీ, ఆఫర్ మాత్రం ఇవ్వలేదని తెలిపింది. ఈ మొత్తం ఏపీసోడ్ లో అసలు విలన్ బెల్లంకొండ సురేష్’ అని తెలిపింది.

శ్రీ రెడ్డి చెప్పినదాని బట్టీ.. ఇదంతా ‘శివలింగ’ సినిమా సమయంలో జరిగిన సీన్ లా కనబడుతోంది. లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘శివలింగ’ సినిమాని బెల్లకొండ సురేష్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఐతే, శ్రీ రెడ్డి ఆరోపణలు చేస్తుంది. కానీ, దానికి సంబంధించిన ఆధారాలని బయటపెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక, నిర్మాత సురేష్ బాబు చిన్నకొడుకు అభిరామ్ తో శ్రీ రెడ్డి వ్యవహారంపై ఇటీవలే డీల్ కుదిరినట్టు వార్తలొచ్చాయి. ఇదే తరహా లారెన్స్, బెల్లకొండ ఏమైనా రాజీకొచ్చి సెటిల్ మెంట్ చేసుకొంటారేమో చూడాలి.