ఆకాషంలో అద్భుతం చూడబోతున్నాం

ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం చూడబోతున్నాం. ఈ నెల 27 అర్ధరాత్రి ఒక గంట 43 నిమిషాలపాటు చోటుచేసుకునే చంద్రగ్రహణం ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైనదని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 27న భూమికి దగ్గరగా వస్తున్నందున అంగారకుడు సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.

ఈ గ్రహణం భారత్‌లోని అన్ని ప్రాంతాల నుంచి కనిపిస్తుంది. గతంలో 2000 సంవత్సరం జులై 16న ఒక గంటా 46 నిమిషాలు, 2011 జూన్‌ 15న ఒక గంటా 40 నిమిషాల పాటు చంద్రగ్రహణం చోటుచేసుకుంది. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు.