నానికి తారక్ ప్రశంస

టాలీవుడ్ నెం. 1 అనిపించుకొనే హీరో తారక్. అతి పిన్న వయసులో ఆయన స్టార్ హీరోగా ఎదిగాడు. గత పాతికేళ్లుగా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. బుల్లితెరపై కూడా తనదైన మార్క్ సెట్ చేశాడు. తారక్ హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఐతే, నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 చప్పగా సాగుతుందనే విమర్శలొస్తున్నాయి. తారక్ రేంజ్ లో నాని షోని డీల్ చేయడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నాని హోస్ట్ పై తారక్ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. సెలక్ట్ మొబైల్ ప్రచారకర్తగా నియమితులైన సందర్భంగా.. శుక్రవారం తారక్ విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ 2లో నాని హోస్టింగ్ పై తారక్ స్పందించారు. నాని మంచి నటుడు. బిగ్‌ బాస్‌లో బాగా చేస్తున్నాడు. ఆ కార్యక్రమానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు తారక్. నిజంగా తారక్ కాంప్లీమెంట్ నానికి బూస్ట్ నిచ్చేదే అని చెప్పవచ్చు.

ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ ‘అరవింద సమేత’తో బిజీగా ఉన్నాడు. మరోవైపు, నాని బిగ్ బాస్ సీజన్ 2ని డీల్ చేస్తూనే.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవదాస్’ చిత్రంలో నాగ్ తో కలిసి నటిస్తున్నారు.