కేసీఆర్’ని కాదని కేటీఆర్…

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్.. ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే స్పందిస్తుంటారు. ఆయా సమస్యలపై అధికారులకి తగిన ఆదేశాలు ఇస్తుంటారు. తాజాగా, కేటీఆర్ ట్విట్టర్ లో టచ్ లోకి వచ్చారు. నెటిజర్స్ తో ఛాట్ చేశారు. వారు అడిగే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. రాజకీయాలు, క్రీడలు, 2019 ఎన్నికలు, సులభతర వాణిజ్యం, నగర బహిష్కరణ.. తదితర అంశాలపై కేటీఆర్ ని ప్రశ్నించారు నెటిజర్స్.

ఒక రాజకీయ నేతగా మీరు సాధించిన గొప్ప విషయాల గురించి చెప్తారా.. ? అన్న ప్రశ్నకు.. ఆ విషయం రిటైరయ్యాక చెబుతానన్నిసమధానం ఇచ్చారు కేటీఆర్. ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పా ? కేసీఆరా ? అనే ప్రశ్నకు.. అది మీకు తెలుసు అన్నారు. ముందస్తు ఎన్నికలపై ఎదురైన ప్రశ్నకు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధమన్నారు. ఇక, ప్రపంచం మొత్తంలో మీకు నచ్చే రాజకీయ నేత ఎవరు అన్న ప్రశ్నకు.. బరాక్ ఒబామా అంటూ కేటీఆర్ సమాధానమిచ్చారు. ఈ విషయంలో కేటీఆర్.. ఆయన తండ్రి కేసీఆర్ కాదని ఒబామా పేరు చెప్పడం ఆకట్టుకుంటోంది. ఐతే, మనదేశంలో కేటీఆర్ కి నచ్చే రాజకీయ నేత కేసీఆర్.. నో డౌట్ అంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు.