వారాహికి ‘విజేత’ ఇచ్చిన గిఫ్ట్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని నిర్మించిన వారాహి బ్యానర్ కు మంచి ఫలితమే దక్కినట్టు ఇండస్ట్రీలో చెప్పుకొంటున్నారు. ఫాదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘విజేత’ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొన్నాడు. దీనికితోడు మెగా సపోర్టు దండుగా లభిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బావ సినిమా బాగుందని ప్రశంసించారు. బావని అభినందించారు. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘విజేత’ విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణ్ గురించి మెగా అభిమానులు ఖుషి అయ్యే మాటలు చెప్పాడు. దీంతో ‘విజేత’ చూసేయాలని మెగా ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.

ఇప్పటికైతే.. ‘విజేత’ పాజిటివ్ గా కనబడుతున్నాడు. మరో వారంలో ‘విజేత’ నిర్మాతని ముంచాడా ? లేదా.. ?? అనేది తేలనుంది. తక్కువ బడ్జెట్ లోనే విజేతని తీసుకొచ్చారు కాబట్టి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఒకవేళ అటు ఇటైనా.. వారాహికి మెగా ఫ్యామిలీ సపోర్టు. ఈ బ్యానర్ లో ఓ సినిమా చేయాలని స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ విజేత విజయోత్సవ సభలోనే తెలిపాడు. ఇప్పుడిదే వారాహి కి విజేత ఇచ్చిన గిఫ్ట్ గా చెబుతున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ గురించి తెలిసిందే. బన్నీతో సినిమా అంతే వారాహి పండపండినట్టే.. !