ఎంసెట్ ఫీజు చెల్లింపు గడువు పొడగింపు.
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సీటు పొందిన విద్యార్థులకు అధికారులు వెసులుబాటు కల్పించారు. ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. విద్యార్థులు ఈనెల 17వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 18 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించామని ఆయన చెప్పారు.