యాదాద్రి శిల్పులకు అక్షర నీరాజనం…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన 100 మంది శిల్పులకు జక్కన్నలకు 1,116మంది కవులు తమ కవితలతో అక్షర నీరాజనం పలికారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఉదయ కళానిధి సంగీత, సాహిత్య, సాంస్కృతిక ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో యాదాద్రి శిల్పకళావైభవం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో యాదాద్రి క్షేత్ర వైభవాన్ని చాటనున్న శిల్పకళకు ప్రాణం పోస్తున్న స్థపతులు, శిల్పులను కవులు తమ కవితలతో వినూత్న రీతిలో సత్కరించారు.
ఈ అక్షర నీరాజనం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. యాదాద్రి ఆలయ నిర్మాణ శిల్పకళా వైభవం ఖండాంతరాలకు వ్యాపించనుందని కవులు తమ కవితల్లో పేర్కొన్నారు. స్థపతి సుందరరాజన్‌కు శిల్పులు వెండి ఉలి, సుత్తిని బహూకరించారు.