దారుణం : బోల్డ్ స్టార్ ని పోర్న్ స్టార్ చేశారు
ఇప్పటికే వెబ్ సిరీస్ ల హవా మొదలైంది. సినిమా ఆఫర్స్ లేని సినీ స్టార్ వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోతున్నారు. బిజీ స్టార్స్ కూడా ఇటు వైపు చూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లోనూ పలు వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్ ల్లో ‘స్కేర్డ్ గేమ్స్’కు మంచి ఆధారణ దక్కుతోంది. సేక్రెడ్ గేమ్స్ గురించి… ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ భారతీయ చిత్ర కథాంశంతో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది.
ఇందులో రాజశ్రీ దేశ్ పాండే నవాజుద్దీన్ సిద్ధికీ భార్యగా సుభద్ర పాత్రలో నటించింది. వీరిద్దరి మధ్య హాట్ హాట్ రొమాంటిక్ సీన్స్ కి కొదవే లేదు. ఓ సీన్ లో రాజశ్రీ టాప్ లెస్ గా కనిపించడం సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడీ సీన్ ని కొందరు పోర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. అంతేకాదు.. రాజశ్రీకి పోర్న్ స్టార్ ట్యాగ్ ని ఇచ్చేశారు. దీంతో బోల్డ్ స్టార్ ని కాస్త పోర్న్ స్టార్ గా ప్రచారం చేస్తున్నారు.
ఈ ప్రచారంపై జశ్రీ స్పందించింది. ‘అడల్డ్ స్టార్ వేరు బోల్డ్ యాక్టర్ వేరు. నేను బోల్డ్ గా నటించాను. కథకు అవసరమై ఆ సీన్ చేశాను. ఒక నటిగా పాత్రకు న్యాయం చేస్తే… నా మీద పోర్న్ స్టార్ ముద్ర వేయడం దారుణం’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాను ఎవరికీ సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. బోల్డ్ సీన్లు చేస్తే ఇలాంటి విమర్శలు – సంఘటనలు ఎదురవుతాయని నాకు తెలుసు’ అని అంటోంది.. ఈ బోల్డ్ స్టార్.
ఇక, ఈ వెబ్ సిరీస్ లో సైఫ్ అలీఖాన్, రాధికా ఆప్టే తదితరులు నటించారు.