ఆ హీరోయిన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే !
గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆర్.ఎక్స్.100’ టైటిల్ కు తగ్గట్టుగానే.. దాని కలెక్షన్ల రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాయి. ఫస్ట్ డే మంచి మైలేజ్ ఇచ్చింది. తొలి రోజే సగం (రూ. 1.41కోట్లు) డబ్బులు వచ్చేశాయ్. రెండు, మూడో రోజు అదే మైలేజ్ తో దూసుకెళ్లింది. తొలి మూడు రోజుల్లో రూ. 3.76 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 2.70 కోట్లకు అమ్ముడు పోయాయి. తొలి 3 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. లాంగ్ రన్ లో లాభాలు ఇంకా పెరగనున్నాయి.
సినిమా కథతో పాటు హీరో హీరోయిన్ల మధ్య వచ్చే బోల్డ్ సీన్లను అందరినీ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఘాటైన ముద్దు సీన్లలో రెచ్చిపోయింది. ఇప్పుడీ ఈ సీన్ల గురించి పాయల్ మీడియా ముందు బోల్డ్‌గా స్టేట్మెంట్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి బోల్డ్ డేరింగ్ క్యారెక్టర్లు చేయాలంటే.. చాలా దైర్యం, సాహసం ఉండాలి. ఆ ధైర్యం నాకుంది. కాబట్టే ఏ మాత్రం భయపడకుండా ఓకే చెప్పానని పాయల్ అంటోంది. నిజంగా ఈ హీరోయిన్ ధైర్యాన్ని మొచ్చుకోవాల్సిందే.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100. కార్తికేయ – పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించారు. రావు రమేష్, సింధూరపువ్వు రామ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాత.