‘అర్జున్ రెడ్డి’ పారితోషికం ఎంతో తెలుసా ?

‘అర్జున్ రెడ్డి’గా విజయ్ దేవరకొండ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ తరం ‘దేవదాసు’ అనిపించుకొన్నాడు. రూ. 40లక్షలతో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ దాదాపు రూ. 50కోట్ల వరకు రాబట్టాడు. ఈ సినిమాతో దర్శకుడు సందీప్ వంగా, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ షాలినీ పాండే స్టార్స్ అయిపోయారు. ఐతే, ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తీసుకొన్న పారితోషికం ఎంతో తెలుసా.. ? రూ. 5 లక్షలు మాత్రమే. ఆదివారం రౌడీ బ్రాండ్ దుస్తులని విడుదల చేసిన సందర్భంగా విజయ్ ఈ విషయం చెప్పాడు. పారితోషికంగా తీసుకొంది రూ. 5లక్షలే అయినా.. ఆ తర్వాత లాభాల్లో షేర్‌ ఇచ్చారట.

‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు గానూ విజయ్‌కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వేలానికి ఉంచి, వచ్చిన మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తానని విజయ్‌ చెప్పారు. ఆ అవార్డు రూ.25 లక్షలకు అమ్ముడు పోయింది. దీన్ని దివి లాబ్స్‌ యజమాని సతీమణి శకుంతలాదేవి దక్కించుకున్నారని చెప్పారు. ఇక, అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.