కేంద్ర‌మంత్రి స్మృతీ ఇరానీని క‌లిసిన మంత్రి కేటీఆర్.

కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీని క‌లిసారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను ఆయ‌న‌ కేంద్రమంత్రికి వివరించారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం 1200 కోట్ల రూపాయలతో బడ్జెట్ కేటాయించామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, దీనివ‌ల్ల ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుంద‌న్నారాయ‌న‌.

రాష్ట్రంలో మరమగ్గాలు ఆధునికీకరణ కు చర్యలు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం అయ్యే ఖ‌ర్చులో 50 శాతం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 8 వేల మగ్గాలను ఆధునికీకరణ చేస్తున్నామ‌ని, ఇందుకు కేంద్రం నుంచి కొన్ని నిధులు రావాల్సి ఉంద‌న్నారు మంత్రి. ఈ విష‌యాన్ని కేంద్ర‌మంత్రి దృష్టికి తీసుకెళ్లామ‌ని, ఆమె సానుకూలంగా స్పందించారని చెప్పారు.