టెస్ట్ సిరీస్ : ఇంగ్లాండ్’తో తలపడే భారత జట్టు ఇదే

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మొదటి మూడు టెస్టుల్లో తలపడే భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. మొత్తం 18 మంది సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. మహమ్మద్‌ షమి, దినేశ్‌ కార్తీక్‌, రిషప్‌ పంత్‌, స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ లకు టెస్టు జట్టులో చోటు దక్కింది.

భారత జట్టు :

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, ఛటేశ్వర్ పుజారా, రహానె(వైస్‌ కెప్టెన్‌), కరుణ్‌ నాయర్‌, దినేశ్‌కార్తీక్‌(వికెట్‌ కీపర్‌), రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, ఇషాంత్‌ శర్మ, మహమ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌.

ఇంగ్లాండ్ టూర్ ని కోహ్లీ సేన ఘనంగా ప్రారంభించింది. టీ20 సిరీస్ ని 2-1 తేడాతో కైవసం చేసుకొంది. మూడు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లోనూ మొదటి వన్ డే మ్యాచ్ ని గెలుచుకొని.. జోరు చూపించింది. ఐతే, ఆ తర్వాత 2, 3వ వన్ డేలో ఆదిత్య జట్టు చేతిలో ఓటమిపాలై వన్ డే సిరీస్ ని చేజార్చుకొంది. కోహ్లీ కెప్టెన్ అయ్యాక ఆయన ఎదురైన తొలి పరాభవంగా దీన్ని విశ్లేషిస్తున్నారు క్రికెట్ పండితులు. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్ లో కోహ్లీ సేన ఏ విధంగా రాణిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.