అతి తక్కువ ధరకు ‘ఇంటెక్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్’.. !

ప్రముఖ మొబైల్ సంస్థ ఇంటెక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర కేవలం రూ.4,999 లకే లభించనుంది. ఫీచర్స్ కూడా బాగుండటంతో తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకొనే వారికి.. ఇదో మంచి ఆప్షన్ లా మారనుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

* 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే

* 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

* 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్

* 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్

* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్

* 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)

* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.