‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడి రెండో సినిమా ఫిక్స్.. !

‘ఆర్ ఎక్స్ 100’ బండి థియేటర్స్ లో చక్కర్లు కొడుతోంది. బంపర్ మైలేజ్ ని ఇస్తుంది. భారీ కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు నుంచి లాభాలు తెచ్చిపెడుతోంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ పెద్ద విజయాన్ని నమోదు చేసింది.లాంగ్ రన్ లో భారీ లాభాలని తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఇప్పుడీ సినిమా దర్శకుడు అజయ్ భూపతీకి పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అజయ్ భూపతితో సినిమా చేసేందుకు సురేష బాబు, స్రవంతి రవికిషోర్ ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.

యంగ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా అజయ్ భూపతితో చర్చచలు జరిపారు. ఇప్పుడా చర్చలు ఫలించినట్టు తెలిసింది. ఆర్ ఎక్స్ 100 దర్శకుడి రెండో సినిమా నితిన్ తో ఉండబోతుందని తేలిపోయింది. ప్రస్తుతం నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వెంకీ కడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత అజయ్ భూపతి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈలోపు నితిన్ కోసం స్క్రిప్ట్ పూర్తి చేయనున్నాడు అజయ్ భూపతి.