కేంద్రంపై అవిశ్వాసం…! కౌంట్ డౌన్ షురూ ..!!

పార్ల‌మెంటు స‌మావేశాల ప్రారంభం రోజే అవిశ్వాస తీర్మానం నోటీసు అంద‌జేశారు టీడీపీ ఎంపీలు. అవిశ్వాస తీర్మాణం నోటీసును స్పీక‌ర్ సుమిత్రామ‌హాజ‌న్ స్వీక‌రించారు. నిబంధనల ప్రకారం పది రోజుల సమయం ఉన్నప్పటికీ ఒకట్రెండు రోజుల్లో చ‌ర్చ నిర్వ‌హించేందుకు స‌మ‌యం కేటాయిస్తాన‌ని స్పీక‌ర్ హామీ ఇచ్చారు. టిడిపి ఎంపి కేశినేనితో పాటు మిగతా పార్టీల నుంచి వచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో చ‌దివి వినిపించారు స్పీకర్ .

శుక్ర‌వారం లోక్ స‌భ‌లో అవిశ్వాసంపై చ‌ర్చ‌కు స్పీక‌ర్ అనుమ‌తిచ్చార‌ని, రాజ్య‌స‌భ‌లో సోమ‌వారం చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కావం ఉంద‌ని టీడీపీ ఎంపీలు తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు అన్ని అవిశ్వాసానికి మ‌ద్ద‌తు తెలిపాయ‌ని, మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన అన్ని పార్టీల‌కు టీడీపీ త‌ర‌పున ధ‌న్యవాదాలు తెలిపారు ఎంపీలు. కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాసం తీర్మానం పెట్టాము ఇది చంద్రబాబు,ఏపీ ప్రజల విజయం.