‘నవ్వుల కిరీటి’కి జన్మదిన శుభాకాంక్షలు
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కాం. నవ్వుల కిరీటి మన రాజేంద్ర ప్రసాద్. హాస్య కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్ ఓ వెలుగు వెలిగారు. హాస్య కథలను తెలుగు తెరపై పరుగులు తీయించారు. అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు.. ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అభిమానులుగా చేసుకున్నారు. ప్రస్తుతం తన వయసు తగిన కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. నవ్వుల కిరీటికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రాజేంద్రుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా రంగంలోకి రావడానికి ముందు ఇద్దరూ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరినవారే. అక్కడి నుంచే ఇద్దరి మధ్య మంచి అనుబంధం వుంది. ఆ తరువాత ఎవరికివారు తమదైన శైలిలో రాణిస్తూ వచ్చారు.