99లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్
ఓ రాజకీయ పార్టీకి మీడియా సపోర్టు చాలా అవసరం. ఆ అవసరాన్ని జనసేన కూడా గుర్తించింది. ఇన్నాళ్లు యూట్యూబ్ ఛానెల్స్ పై ఆధారపడిన ఈ పార్టీ సొంత ఛానెల్స్ ని సమకూర్చుకొనే పనిలో పడింది. ఇప్పటికే రెండు మూడు ఛానెల్స్ ని తీసుకొన్నట్టు తెలిసింది. ఇందులో ’99 న్యూస్’ ఛానల్ ఒకటి. సీపీఐ కి చెందిన ఈ ఛానెల్ ని జనసేన టేకోవర్ చేసుకొంది. ఇటీవలే ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ’99 టీవీ’ ఛానెల్ కు వెళ్లారు. ఛానెల్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఛానెల్ చెందిన మైకు ని పట్టుకొని.. ఇదేనా మన ఛానెల్ అని ప్రశ్నించారు. సమాజానికి మేలు చేసేందుకు, అవినీతిని ఎండగట్టేందుకు ఈ ఛానల్ మనకు ఉపయోగపడుతుందన్నారు. పవన్ 99టీవీలోకి మొదటి సారి అడుగుపెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ, జనసేన ల మధ్య ఉండనుంది. ఈ మూడు పార్టీల్లో టీడీపీ, వైసీపీలకు కావాల్సినంత మీడియా సపోర్టు ఉంది. సాక్షి పేపర్, న్యూస్ ఛానెల్ లో ఎప్పుడు చూసిన వైసీపీ సోధినే. ఇదీగాక, మరో ఒకట్రెండు ఛానెల్స్ ని తన కంట్రోల్ పెట్టుకొంది జగన్ పార్టీ. ఇక, టీడీపీ గురించి చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ మీడియాని మేనేజ్ చేయడంలో నెం.1 అని చెప్పవచ్చు. ఓ అరడజను పైగా టీవీఎ ఛానెల్స్ టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. వీటినే ఎల్లో మీడియాగా పిలుస్తుంటారు. ఇప్పుడు జనసేన కూడా సొంత టీవీ ఛానెల్స్ ని సమకూర్చుకొనే పనిలో ఉంది. మరీ.. వీటిని ‘పవర్ మీడియా’ అంటారేమో.. !