రెండో పెళ్లిపై సింగర్ సునీత స్పందన ఇది.. !
ప్రముఖ తెలుగు సింగర్ సునీతపై భయంకరమైన ప్రచారం జరుగుతోంది. ఆమె రెండో పెళ్లి రెడీ అయిందన్నది ఈ ప్రచారం సారాంశం. ఇది కాస్త వైరల్ గా మారడంతో దీనిపై సునీత స్పందించారు. ‘ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మీకు ఎందుకంత ఆసక్తి ?’ అంటూ తన ఫేస్‌బుక్ పేజీలో స్టేటస్ పెట్టారు. ఆమె స్పందన మరింత గందరగోళానికి గురి చేస్తోంది. రెండో పెళ్లిపై క్లారిటీ ఇస్తూ.. ఆమె ఆ స్టేటస్ పెడితే ఓ క్లారిటీ ఇచ్చినట్టుండేది. కానీ, సునీత అలా చేయలేదు. అగ్గి ఆజ్యం పోసినట్టు.. ఖండించకుండా.. క్లారిటీ ఇవ్వకుండా అయోమయంలో పడేసింది. మౌనం అర్థాంగీకారం లాగా ఆమె రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉందనుకోవాలేమో.. ! బహుశా.. ఈ ప్రచారంపై సునీత స్పందిస్తుందేమో.
చాన్నాళ్లుగా సునీత ఒంటరిగానే ఉంటుంది. ఆమెకు 19 యేట ఏటనే కిరణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. దాదాపు 17యేళ్ల క్రితమే ఆయనతో విడిపోయింది. సునీతకు కుమారుడు ఆకాష్ (20), కుమార్తె శ్రేయ (17) ఉన్నారు. పిల్లలే ప్రపంచగా ఆమె జీవితం కొనసాగిస్తున్నారు. ఐతే, 40యేళ్ల వయసులో సునీత రెండో పెళ్లిపై వార్తలు రావడం.. ఆమె అభిమానులని షాక్ గురి చేస్తున్నాయి. ఆమె గాసిప్ రావడం ఇది తొలిసారేం కాదు. చాలాసార్లు మీడియా నుంచి తలనొప్పులు ఎదుర్కొంది సునీత. ఐతే, ఈసారి చాలా సీరియస్ విషయం. దానిపై అంతే సీరియస్ గా క్లారిటీ ఇస్తే దానికి పులిస్టాప్ పడిపోయింది. అలా కాకుండా అది నా వ్యక్తిగత జీవితం అనడంతో… ఆ ప్రచారంలో నిజముందని భావించాల్సి వస్తుందని అనుకొంటున్నారు.