శ్రీనివాస్ కళ్యాణం కాన్సెప్ట్ అదిరింది.. !

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇంకా పెళ్లి చేసుకోకున్నా.. పెళ్లి గొప్పదనం గురించి చెబుతున్నాడు. ఆయన తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. సతీష్ విష్నేష్ దర్శకుడు. నితిన్ కి జంటగా రాశీఖన్నా జతకట్టింది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22న థియేటర్స్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ జరగనుంది. తాజాగా, ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

“మనం పుట్టినప్పుడు మనవాళ్లందరూ ఆనందపడతారు. అది మనకు తెలియదు. మనం దూరమైనప్పుడు మనవాళ్లందరూ బాధపడతారు, అదీ మనకు తెలీదు. మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి, మనవాళ్లందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పదనం గురించి చెప్పే చిన్ని ప్రయత్నమే మా ఈ ‘శ్రీనివాస కల్యాణం’ ” అంటూ కాన్సెప్ట్ టీజర్‌ను రూపొందించారు. సీనియర్ నటి జయసుధ వాయిస్ ఓవర్ తో కట్ చేసిన కాన్సెప్ట్ టీజర్ అదిరిపోయింది.

ఫ్యామిలీ ప్రేక్షకులు కచ్చితంగా సినిమా చూసి తీరాలన్న విధంగా హాయిగా ఉంది కాన్సెప్ట్ టీజర్. గత యేడాది సతీష్ విగ్నేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘శతమానం భవతి’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతకుమించి జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది. ఇప్పుడిదే దర్శకుడు.. అదే దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.