శభాష్ జయదేవ్.. చంద్రబాబు ట్వీట్ !
లోక్ సభలో నేటి అవిశ్వాస తీర్మాణంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం ఆకట్టుకొంది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై కేంద్రం తీరును ఆయన ఎండగట్టారు. ఇందుకోసం ఆయన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ భరత్ అను నేను, బాహుబలి సినిమాలని ప్రస్తావించారు. జయదేవ్ ప్రసంగంపై సర్వాత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి కూడా జయదేవ్‌ను ప్రశంసించారు. గల్లా ప్రసంగంపై బాబు ట్వీట్ చేశారు.
‘ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో గల్లా జయదేవ్ సమగ్రంగా చూపించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకే మేం ఈ పోరాటం చేస్తున్నాం. ఏపీ ప్రత్యేక హోదా కింద 2014లో ప్రధాని మోదీ ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని పూర్తి చేయమని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని చంద్రబాబు నాయుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ అవిశ్వాస తీర్మాణంతో ఏపీ సమస్యలని దేశ సమస్యలుగా మార్చడంలో టీడీపీ విజయం సాధించింది. ఇదిగాక, వచ్చే ఎన్నికల ముందు ప్రతిపక్షాల ఐక్యతకు ఇంది నాంది పలికిందని చెప్పవచ్చు. ఈ స్పూర్తితోనే విపక్షాలన్నీ ఏకమై బీజేపీని మట్టికరిపించేందుకు సిద్ధం కానుంది.
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చను ప్రారంభించిన .@JayGalla రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై స్పష్టమైన గళాన్ని వినిపించారు. ఇప్పటికైనా ఐదు కోట్ల ఆంధ్రులకు ఇచ్చిన హామీని ప్రధాని నిలబెట్టుకోవాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. #APDemandsJustice
— N Chandrababu Naidu (@ncbn) July 20, 2018