పార్ల‌మెంటులో ‘భ‌ర‌త్ అనే నేను’…!!

కేంద్ర‌ప్రభుత్వంపై అవిశ్వాసం నేప‌థ్యంలో పార్ల‌మెంటులో చ‌ర్చ ప్రారంభ‌మైంది. టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ చ‌ర్చ‌ను ప్రారంభించారు. భ‌ర‌త్ అనే నేను స్టోరీ లైన్ తో ఆయ‌న చ‌ర్చ‌ను ప్రారంభించారు. మాట నిల‌బెట్టుకోవ‌డం గురించి భ‌ర‌త్ అనే నేను సినిమాలో చూపించార‌ని, ప్ర‌స్తుతం టీడీపీ కూడా మాట నిల‌బెట్టుకోవాల‌నే చెబుతోంద‌ని, అందుకే అవిశ్వాసం పెట్టామ‌ని గ‌ల్లా జ‌య‌దేవ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని, అప‌న‌మ్మ‌కం, ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం, న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్లు, ధ‌ర్మ‌పోరాటం అనే నాలుగు అంశాల ఆధారంగా అవిశ్వాసం పెట్టామ‌ని గ‌ల్లా తెలిపారు. ఏపీకి రావాల్సిన నిధులు, జ‌రిగిన అన్యాయంపై ఆయ‌న పార్ల‌మెంటులో వివ‌రించారు. ఇది సంఖ్యాబ‌లానికి, నైతికత‌కుమ‌ధ్య జ‌రుగుతున్న అవిశ్వాస పోరాట‌మ‌ని ఆయ‌న వ‌ర్ణించారు. ఏపీకి సంబంధించి గ‌తంలో ప్ర‌భుత్వ హామీలు, అమ‌లు తీరుపై కూలంక‌శంగా వివ‌రించారు జ‌య‌దేవ్.