నువ్వు నా పక్కనే ఉంటే సంతోషం నా వెంటే : చరణ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనపై ఉన్న ప్రేమని మరోసారి చూపించారు. శుక్రవారం ఉపాసన పుట్టినరోజు. ఆమె బర్త్ డే వేడుకని చరణ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. అంతకంటే ముందే సోషల్‌మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. ‘నువ్వు దయా హృదయురాలివి, అమేజింగ్‌, ఫెన్టాస్టిక్‌, బ్యూటిఫుల్‌. నువ్వు నా పక్కనే ఉంటే నేనెప్పుడూ సంతోషంగా ఉంటాను. హ్యాపీ బర్త్‌డే లవ్‌’ అని చెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఉపాసనతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

శుక్రవారం మరో సెలబ్రేటీ బర్త్ డే కూడా. ఆమె ఎవరో కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార. ఈ చిన్నారికి చరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘హాయ్‌ సితార.. ఎలా ఉన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. నీ బర్త్‌డే, ఉప్సి బర్త్‌డే ఒకే రోజు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈసారి నిన్ను కలిసినప్పుడు నా కోసం ఓ మంచి పాట పాడాలి. మర్చిపోకు. బాయ్‌’అంటూ చెప్పిన ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఈ యేడాది ‘రంగస్థలం’తో చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు. ఈ సినిమా ఏకంగా నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టింది. అంతకుమించి రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రకు ప్రశంసల జల్లు కురిసింది. ప్రస్తుతం చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది హై ఓల్టేష్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమా తర్వాత రాజమౌఌ దర్శకత్వంలో చరణ్-తారక్ ల మల్టీస్టారర్ తెరకెక్కనుంది.