పవన్ ట్వీట్లపై స్పందించిన బాబు..!
బీజేపీకి వంత పాడుతూ పంచన చేరే పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అవిశ్వాసం నేపథ్యంలో పవన్ ట్వీట్లపై చంద్రబాబు స్పందించారు. పోరాడే వారిని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ ప్రశ్నించారు సీఎం. శుక్రవారం టడీపీపై పవన్ ట్వీట్లతో విమర్శించడాన్ని ఆయన ఖండించారు. శుక్రవారం ఉదయం నుంచి పవన్ ట్వీట్లేంటీ..? అసలు పవన్ చేసింది ధర్మమేనా..? అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
కర్ణాటకలో కావేరి విషయంలో అక్కడి పార్టీల మధ్య విభేదాలు కన్పించ లేదు…కానీ ఏపీలో బహిరంగంగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. హరిబాబు ఎందుకంత ఆగ్రహంతో ఊగిపోయారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కోసం కాకున్నా.. ప్రజల కోసమైనా ఏపీకి న్యాయం చేయాలని హరిబాబు ఎందుకు అడగలేకపోయారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడితే వైసీపీ టీడీపీ ట్రాపులో పడ్డట్లు భావిస్తే , బీజేపీ చెప్పినట్టు వింటే ట్రాపులో పడినట్టు కాదా అని దుయ్యబట్టారు.