హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 ప‌రీక్ష వాయిదా !

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హిస్తున్న హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ 2 ప‌రీక్ష వాయిదా వేస్తున్న‌ట్లు టీఎస్ పీఎస్సీ చైర్మ‌న్ గంటా చ‌క్ర‌పాణి తెలిపారు. తెలంగాణ సంప్ర‌దాయ పండుగ బోనాలు ఉత్స‌వాల సంద‌ర్భంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ నెల 29న బోనాల పండుగ సంద‌ర్భంగా హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్-2 ప‌రీక్ష వాయిదా వేశారు. ఆగ‌స్టు 5న ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.