జులై 20 – అంతర్జాతీయ ఆలింగన దినోత్సవం
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘జులై 20’ని అంతర్జాతీయ ఆలింగన దినోత్సవం చేసేశాడు. ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చిన ఒకే ఒక్క హగ్ తో ఆ ఘనతని సాధించాడు. భాజపా ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకొన్నాయి. సభలో తన ప్రసంగం ముగిశాక రాహుల్ నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో మోదీతో పాటు సభలోని వారందరూ అవాక్కయ్యారు. మోడీని ఆలింగనం చేసుకుని తిరిగి వెళ్లిపోతున్న అనంతరం రాహుల్‌ను వెనక్కి పిలిచిన మోడీ.. కరచాలనం చేసి ఆయన భుజం తట్టారు. ఈ హగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిపై నెటిజర్స్ ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నాయి. ‘జులై 20ని అంతర్జాతీయ ఆలింగన దినోత్సవంగా యునెస్కో ప్రకటిస్తుంది అని ఓ నెటిజర్ కామెంట్ పెట్టాడు.
నెటిజర్స్ చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ :
* గొప్ప ప్రసంగం..గొప్ప ఆలింగనం.. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రాన్ని రాహుల్ మళ్లీ గుర్తు చేశారు
* ఆలింగనం చేసుకున్నప్పుడు మోదీకి 56అంగుళాల ఛాతీ ఉన్నట్లు నాకు అనిపించలేదు
* మోదీ : అంతేనా ! రాహుల్ : ఇంకేం కావాలి ! మోదీ : కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు మాటలు..
* ‘ప్రధాని అయ్యాక విదేశీ నేతలను ఎలా ఆలింగనం చేసుకోవాలో మోదీ వద్ద ఇప్పటినుంచే రాహుల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.’
* ‘రాహుల్.. మోదీని హగ్ చేసుకోమని నీకు ముందే రాసిచ్చిన స్క్రిప్ట్‌లో ఉందా? అచ్చం అలాగే చేశావా?’
* రాహుల్ తో మోదీ : ‘ఈ వయసులో నాకు ఇలాంటి సర్ప్రైజ్లు ఎందుకు రాహుల్?’
* వీడియో ఆఫ్ ది డికేడ్!