యుఎస్ సక్సె రాకెట్ : మంచు లక్ష్మీకి తిప్పలు తప్పలేదు
అమెరికాలో తెలుగు హీరోయిన్స్ సెక్స్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. త్వరలోనే నిజనిజాలు తేలనున్నాయి. ఐతే, ఈలోపు అమెరికా వెళ్లిన ప్రతి టాలీవుడ్ హీరోయిన్ అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల యుఎస్ వెళ్లిన యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమెని యుఎస్ అధికారులు ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి చాలా సేపు విచారించారు. ఆ తర్వాత ఆమెకు సారి చెప్పి పంపించేశారు. ఐతే, ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజంగానే యుఎస్ సెక్స్ రాకెట్ తో మెహ్రీన్ కు సంబంధాలున్నట్టు తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపై మెహ్రీన్ ఒకటి రెండు సార్లు క్లారిటీ ఇవ్వడంతో.. ఆ ప్రచారనికి పులిస్టాప్ పడింది.
తాజాగా, మంచు లక్ష్మీ కూడా యుఎస్ సెక్స్ రాకెట్ తో తిప్పలు పడినట్టు తెలిసి వచ్చింది. ఆమె లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘W/o రామ్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. ఐతే, ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న లక్ష్మీ అమెరికా సెక్స్ రాకెట్ పై స్పందించింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరైన నిబంధనలు లేకపోవడం వల్లే ఇలాంటివి చోటుచేసుకొంటున్నాయి అన్నారామె.
తనని కూడా అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానంగా చూశారు. నాకు రెండు రకాల వీసాలు ఉంటాయి. ఒకటి ఓ1, మరొకటి బిజినెస్ వీసా. నీకు రెండు రకాల వీసాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. నేను చెప్పిన సమాధానం అర్థం కాకపోయే సరికి నన్ను పక్కకు పెట్టారు. వాళ్లకు అర్ధం కాకపోతే ప్రతీ ఒక్కరిని అనుమానిస్తారు తెలిపింది లక్ష్మీ. దీంతో యుఎస్ సెక్స్ రాకెట్ లో మంచి లక్ష్మీ కూడా తిప్పలు పడినట్టు అందరికీ తెలిసింది.
ఇక, మంచు మనోజ్ విడాకులపై వస్తున్న వార్తలపై మంచు లక్ష్మీ స్పందించారు. ఆయన జీవితంలో ఏం జరిగిందనే విషయంపై నేను స్పందించడం సరికాదు. ఎవరి వ్యక్తిగత జీవితాలు వారివి. వారి జీవితాల గురించి నేను బహిరంగంగా మాట్లాడటం సరికాదు అన్నారు. మంచి లక్ష్మీ మాటలని బట్టీ చూస్తే మనోజ్ పర్సనల్ లైఫ్ లో కష్టాలు మొదలైనట్టు అనిపిస్తోంది. విడాకుల న్యూస్ నిజమేనని అగుపిస్తొంది.