మార్కెట్’లోకి నోకియా 6.1ప్లస్
నోకియా ఎక్స్6 గ్లోబల్ వేరియంట్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ విడుదల చేసింది. నోకియా 6.1ప్లస్ పేరుతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేశారు. ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రామ్ కింద వస్తున్న ఈ మొబైల్ స్టాక్ ఆండ్రాయిడ్‌తో రానుంది. నోకియా 6.1ప్లస్ ధరను 2,228 హాంకాంగ్ డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో దీని ధర సుమారు రూ.20,000. నీలం, తెలుపు రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ జులై 24 నుంచి హాంకాంగ్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. త్వరలోనే భారత్ లో కూడా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది
నోకియా 6.1ప్లస్ ఫీచర్స్ :
* 5.8 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే(19:9) విత్ 2.5డి గోరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్
* ఆండ్రాయిడ్ ఓరియో 8.1
* స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
* 4జీబీ ర్యామ్
* 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 400 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే సామర్థ్యం
* 16+5మెగాపిక్సెల్ వెనుక కెమెరా
* 16 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ సపోర్ట్, టైప్ సి పోర్ట్, క్విక్ ఛార్జింగ్ 3.0 సదుపాయం
* 3060 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం