టీడీపీ ‘గ‌జినీ’లా వ్య‌వ‌హ‌రిస్తోంది..!!


టీడీపీ వ్య‌వ‌హార‌శైలిపై ప‌వ‌న్ ట్విట్ట‌ర్ లో విరుచుకుపడ్డారు.. తెలుగుదేశం పార్టీ త‌న‌కు అనుగుణంగా ఉన్న‌వాటిని గుర్తుంచుకుని , మిగ‌తా వాటిని మ‌రిచిపోతోంద‌ని, గ‌జిని సినిమాలో హీరోలా మెమ‌రీ లాస్ ఉన్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని ప‌వ‌న్ ట్విట్ట‌ర్ లో విమ‌ర్శించారు. జ‌న‌సేన ఎప్పుడూ త‌న‌కు ఏది అనుకూలమో అది చేయ‌ద‌ని, ఏది స‌రైన‌ది అనుకుంటే అదే చేస్తుంద‌ని పేర్కొన్నారు ప‌వ‌న్.

ప్ర‌త్యేక హోదా ల‌క్ష్యాన్ని ఎవ‌రు నీరుగార్చారో, ఎవ‌రు బీజేపీతో కుమ్మ‌క్క‌య్యారో ఒక‌సారి పున‌రాలోచించుకుని మాట్లాడాల‌ని అన్నారు. పూట‌కో ర‌కంగా నిర్ణ‌యాన్ని మార్చుకుంటున్న టీడీపీ, మ‌ళ్లీ తన నిర్ణ‌యాన్ని మార్చుకోద‌న్న గ్యారంటీ ఇవ్వ‌గ‌ల‌దా అని ప్ర‌శ్నించారు ప‌వ‌న్. అవ‌స‌రాల‌క‌నుగుణంగా నిర్ణ‌యాలు మార్చుకోద‌ని గ్యారంటీ ఉందా అని ట్విట్ట‌ర్ ప్ర‌శ్నించారు.