రాహుల్’తో తాను.. ఆనందంగా ఉంది !

రాహుల్ గాంధీ కన్నుకొడితే హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ సంబరపడిపోతుంది. అరె.. లింకు ఎక్కడ కుదిరింది అనుకొంటున్నారు. కన్నుకొట్టి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ప్రియావారియర్. ఇప్పుడా ఆమెను అనుసరిస్తున్నట్టుగా లోక్ సభలో రాహుల్ గాంధీ కన్నుకొట్టారు. కొద్దిగా అటు ఇటుగా ప్రియావారియర్ లా ట్రై చేశాడు. అది వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు కన్నుకొట్టడంలో రాహుల్ ని ప్రియావారియర్ తో పోలుస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పుట్టుకొస్తున్నాయి. వీటికి ఆసక్తికరమైన కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. ఈ వైరల్ న్యూస్ పై ప్రియావారియర్ స్పందించడం సంచలనంగా మారింది.

తాజాగా మీడియా ముందుకొచ్చిన ప్రియా వారియర్.. “నేను కాలేజి నుంచి ఇంటికి తిరిగి రాగానే మా అమ్మ నాకీ విషయం చెప్పింది. దీంతో టీవీ చూశాను. ప్రధాని నరేంద్ర మోదీ సర్‌ ఉండగా పార్లమెంట్‌లో రాహుల్‌ సర్‌ కన్నుకొట్టారని వస్తోంది. సోషల్‌ మీడియాలో రాహుల్‌ సర్‌ను నన్ను పోల్చి చూపిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అంతపెద్ద వ్యక్తితో నన్ను పోల్చినందుకు సంతోషిస్తున్నా. ఈరోజు నాకు మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. కొన్ని నెలల తర్వాత నా పేరు ఇంటర్నెట్‌లో మళ్లీ సంచలనం అవుతోంది” అంది.

మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్’లోని ‘మాణిక్య మలరాయ’ పాటకుగాను ప్రియ పలికించిన హావభావాలు కొన్ని నెలల క్రితం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాయి. ఆమె నటించిన తొలిచిత్రానికి అంతలా అభినయం ప్రదర్శించడంతో యావత్‌ సినీ, క్రికెట్‌ ప్రముఖుల ప్రశంసలు ప్రియా అందుకున్నారు. ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత రాహుల్ గాంధీ కన్నుకొట్టుడు పుణ్యమా.. అని మరోసారి ఈ యంగ్ హీరోయిన్ కు ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టయ్యింది. ఇప్పట్లో రాహుల్-ప్రియా వారియర్ ని జనాలు వదిలేలా లేరు.