షాక్ : వాట్సాప్’లో ఫార్వార్డ్ ఐకాన్ బటన్ డిలీట్

వాట్సాప్ యాప్ యూజర్స్ షాక్ ఇవ్వనుంది. ఫార్వార్డ్ ఐకాన్ బటన్ ను తొలగించేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు ఎన్నికల సంఘం (ఈసీ)కి హామీ ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా మనుషుల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇదీగాక, వచ్చేది ఎన్నికల కాలం. ఈ నేపథ్యంలో తమ యాప్ ద్వారా వదంతులు వ్యాపించకుండా జాగ్రత్త పడతామని ఆ సంస్థ పేర్కొంది.

ఈ క్రమంలోనే వాట్సాప్ లో ఫార్వార్డ్ ఐకాన్ బటన్ ను తొలగించనున్నారు. ఈ బటన్ ద్వారా కేవలం ఐదుగురికి మాత్రమే ఏదైనా సందేశాన్ని ఫార్వార్డ్ చేసే అవకాశాన్ని కల్పిస్తామని, ఈ మేరకు నియంత్రణా చర్యలు చేపట్టామని పేర్కొంది వాట్సాప్ సంస్థ పేర్కొంది. యాప్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈసీకి వాట్స్ యాప్ తెలియజేసింది. ఇది వాట్సాప్ యూజర్స్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.