యాదాద్రి ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ !

దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక దేవాలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ జారీ అయింది. గ‌త కొద్ది రోజుల క్రితం ఐఎస్ఓ అధికారులు యాదాద్రి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ప‌రిశీలించిన అధికారులు ఆల‌యానికి ఐఎస్ఓ స‌ర్టిఫికెట్ ను జారీచేశారు. ఈ సంద‌ర్భంగా వైటీడీఏ ఉపాధ్య‌క్షులు కిష‌న్ రావు, యాదాద్రి ఆల‌య ఈవో గీతారెడ్డి సీఎం కేసీఆర్ ను క‌లిసారు.

ఐఎస్ఓ సర్టిఫికెట్ దక్కించుకున్నందుకు అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. ఐఎస్ఓ సర్టిఫికెట్, ఆలయ పునరుద్ధర‌ణ‌ పనుల డిజిటైజేషన్ పనుల వివరాలను సీఎంకు వివరించారు అధికారులు. పర్యావరణం, భద్రత, నిర్వహణ, విద్యుత్ సరఫరా అంశాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందింది యాదాద్రి దేవాల‌యం.