శ్రీరెడ్డి వ్యభిచారం చేస్తోంది.. అరెస్ట్ చేయండి !

నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైన్నైలో తిష్టవేసి శ్రీరెడ్డి తమిళ లీక్స్ ని కొనసాగిస్తోంది. అక్కడి దర్శకులు, హీరోలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే మురగదాస్, రాఘవ లారెన్స్, శ్రీనాథ్, సుందర్ సి పై షాకింగ్ ఆరోపణలు చేసింది. ఐతే, శ్రీరెడ్డి గట్టిగా బుద్ది చెప్పాలనే ఆలోచనలో కోలీవుడ్ పెద్దలు వార్తలొచ్చాయ్. అంతకంటే ముందే ఇండియన్ మక్కల్ మంద్రం (ఐఎంఎం) అనే సంస్థకు చెందిన సభ్యుడు ఒకరు శ్రీరెడ్డిపై సిటీ పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి వ్యభిచారం, డబ్బు దోపిడీ చేస్తుందంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడీ న్యూస్ కోలీవుడ్, టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ఇన్నాళ్లు శ్రీరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఫస్ట్ టైం ఆమెకు షాకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘శ్రీరెడ్డి వ్యవహారం భారతీయ సమాజాన్ని, సంస్కృతిని అవమానించే విధంగా ఉంది. సినిమా అవకాశాల కోసం దర్శకులు, యాక్టర్ల వద్ద పడుకున్నట్లు ఆమె స్వయంగా ఒప్పుకుంటోంది. ఇలా చేయడం వ్యభిచారం కిందకే వస్తుంది.
వెంటనే ఆమెపై వ్యభిచారం చేస్తున్నట్లు కేసులు నమోదు చేసి.. అరెస్ట్ చేయాలి’ అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఐఎంఎం సభ్యుడు. ఐతే, దీని వెనక తమళ్ ఇండస్ట్రీ పెద్దలు ఏమైనా ఉన్నారా.. ? అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ ఫిర్యాదుతో చెన్నై పోలీసులు శ్రీరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ? అనేది ఆసక్తిగా మారింది.