పెళ్లి తర్వాత.. చైతూ-సమంత మొదలెట్టారు !
పెళ్లికి ముందు చైతూ-సమంతల రొమాన్స్ ని ప్రేక్షకులు చూసేశారు. ఏ మాయ చేశావె, ఆటో నగర్ సూర్య, మనం సినిమాల కోసం చైతూ-సామ్ జతకట్టారు. ఐతే, పెళ్లి తర్వాత కూడా వీరి రొమాన్స్ ని తెరపై చూడాలని ఆశపడుతున్నారు. ఇప్పుడా కోరిక నెరవేరనుంది. ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ-సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనుంది.
కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. సినిమాలోనూ చైతూ-సామ్ పెళ్లైన జంటగా కనిపించబోతున్నారు. దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ కనిపించనుంది. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపీ సుందర్. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు రెండో వారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.