కేటీఆర్.. సూపర్ హీరో !

తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, నాని లు కేటీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. కేటీఆర్ ని విష్ చేసిన వారిలో ఒమర్ అబ్దుల్లా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నారా లోకేష్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ కూడా ఉన్నారు. జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్ ఓపిగ్గా రిప్లే ఇస్తున్నారు. ఐతే, కేటీఆర్ కు వచ్చిన బర్త్ డే విషెస్ లో ఆయన కుటుంబ సభ్యుల నుంచి వచ్చినవి హైలైట్ గా నిలిచాయి.

మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘అత్యంత సమర్థవంతమైన, శ్రమించేతత్వం ఉన్న మన నాయకుడు కేటీఆర్‌.. మళ్లీ మళ్లీ ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా’నని హరీష్ ట్విట్ చేశారు. దీనికి ‘థ్యాంక్స్ బావా’ అని కేటీఆర్ బదులిచ్చారు. ఇక, ఎంపీ కవిత అన్నయ్య కేటీఆర్ ని సూపర్ స్టార్ ని చేసింది. ‘సూపర్ హీరోలు లేరని భావించే వాళ్లకు నీ గురించి తెలుసుకోమని చెబుతా.. హ్యాపీ బర్త్ డే అన్నయ్యా’ అంటూ కవిత ట్వీట్ చేశారు.

నిజంగా కేటీఆర్ సూపర్ హీరో. ఈ తరం రాజకీయ నాయకుడు అనిపించుకొన్నాడు. అందరితోనూ స్నేహభావంతో మసులుకొంటాడు. ఇప్పుడున్న హోదా క్షణంలో మాయమైపోయింది. వ్యక్తిత్వమే మనల్ని నిలబెడుతుందని బలంగా నమ్మే నాయకుడు కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఆకట్టుకొంది. ఇదీగాక, సోషల్ మీడియా వేదికగా ఆయన వివిధ సమస్యలపై కేటీఆర్ స్పందించడం.. వాటిని పరిష్కరించడం మెచ్చుకోదగిన విషయం. సూపర్ హీరో కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.