చుక్ చుక్.. ‘భారత్ దర్శన్’ చౌకగా.. !
దేశంలోని ఆధ్యాత్మిక ప్రాంతాలను చౌకగా, సౌకర్యంగా చుట్టేసి అవకాశం ‘భారత్ దర్శన్’తో కలగనుంది. భారతీయ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘భారత్ దర్శన్’ రైలు ఆధ్యాత్మిక ప్రాంతాలన్నింటిని చూటేసి రానుంది. ఈ రైల్ లో స్లీపర్ క్లాస్ కన్ఫార్మ్ టికెట్ లభిస్తుంది. వసతి సదుపాయాలు కూడా కల్పిస్తుంది. రైలుకు ఏసీ కోచ్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. చిన్న రైల్వే స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగుతుంది. ప్రయాణికుల భద్రత కోసం రైల్లో రక్షణ సిబ్బంది కూడా ఉంటారు. ఈ యాత్ర టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా ఏజెంట్ల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ‘భారత్ దర్శన్’ కింద నడుస్తున్న వివిధ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీరామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలు :
* బోర్డింగ్ స్టేషన్: సఫ్దర్‌జంగ్, ఢిల్లీ
* ప్యాకేజీ : రూ.15,120
* తేదీ : నవంబరు 14, 2018
* ఏయే ప్రాంతాలు? : రామాయణంలో పేర్కొన్న శ్రీరాముడి పుణ్యక్షేత్రాలు మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. అయోధ్య, చిత్రకుట్, నాసిక్, మదురై, రామేశ్వరం, వారణాసి తదితర
పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.
జ్యోతిర్లింగాల యాత్ర :
* బోర్డింగ్ స్టేషన్ : సఫ్దర్ జంగ్, ఢిల్లీ
* ప్యాకేజీ : రూ.11,340
* తేదీ: సెప్టెంబరు 14, 2018
* ఏయే ప్రాంతాలు?: అహ్మదాబాద్, భీమ్‌శంకర్, ద్వారకా, నాగేశ్వర్, ఓంకారేశ్వర్, షిరిడి, సోమ్‌నాథ్, త్రంబకేశ్వర్, ఉజ్జయినీ తదితర ప్రాంతాలు.
భారత్ దర్శన్ స్పెషల్ రైలు :
* బోర్డింగ్ స్టేషన్: రాజ్‌కోట్ జంక్షన్
* ప్యాకేజ్: రూ.11,340
* తేదీ: అక్టోబరు 31, 2018
* ఏయే ప్రాంతాలు?: కొచువేలీ, ముదరై, రామేశ్వరం, రేణిగుంట జంక్షన్, షిరిడీ.
దక్షిణ దర్శన్ ట్రైన్ :
* బోర్డింగ్ స్టేషన్: చత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్
* ప్యాకేజీ: రూ.8,505
* తేదీ: అక్టోబర్ 19, 2018
* ఏయే ప్రాంతాలు?: కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూర్, త్రివేండ్రం