బిగ్ బాస్ హౌస్‌లో రాజమౌళి
నేచురల్ స్టార్ నాని హోస్ట్’గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆసక్తిగా సాగుతోంది. మొదట్లో చప్పగా సాగిన ఈ షో రాను రాను ట్రాక్ లోకి వచ్చేసింది. ఈ మధ్య షో కాస్త రొమాంటిక్ గా సాగడం కూడా ఇందుకు కారణం. ఐతే, బిగ్ బాస్ హౌస్ లో దర్శకధీరుడు రాజమౌళి హవా చూపిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. అలాగని.. రాజమౌళి బిగ్ బాస్ హౌస్ సడెన్ సప్రైజ్ ఏమీ ఇవ్వలేదు. కాకపోతే సోమవారం రాత్రి షోలో ఆయన హాట్ టాపిక్ గా మారారు. ప్రతి సోమవారం మాదిరిగానే ఈ వారం హౌస్ లో ఎలినేషన్ కు నామినేషన్ జరిగింది. ఇందుకోసం ఒక ఇంటి సభ్యుడు తనకు ఇష్టంలేని ఇద్దరు సభ్యులని ఎంచుకొని దానికి గల కారణాలు చెప్పి.. వారి నెత్తిపై కోడి గుడ్డు పగలగొట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
ఈ ప్రక్రియ నుంచి కెప్టెన్ అయినందున తనీష్ ని మినహాయించారు. ఈ నామినేషన్ లో కౌశల్ టార్గెట్ గా మారాడు. ఆయన తలపై ఏకంగా ఏడు గుడ్లు పగలాయి. అమిత్, రోల్ రైడా, తనీష్, నందిని, బాబు గోగినేని, గణేష్‌లు కౌశల్‌పై గుడ్లు పగలగొట్టారు. ఐతే, కౌశల్ మాత్రం నందిని, బాబు గోగినేనిపై గుడ్లు పగలగొట్టాడు. బాబు గోగినేనినే ఎందుకు ఎంచుకొన్నాడు అనే దానిపై ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. బాబు గోగినేని రాజమౌళి విషయంలో తప్పుగా మాట్లాడాడు. రాజమౌళి నాస్తికుడై కూడా మంత్రాలయం వెళ్లి రాఘవేంద్ర స్వామిని దర్శించుకొన్నారని బాబు గోగినేని అనడం తనకు నచ్చలేదు. రాజమౌళి తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన్ని ఏమైనా అంటే సినిమా వాళ్లంగా మేము ఊరుకునేది లేదన్నారు. అందుకే ఆయన్ని నామినేట్ చేసినట్టు తెలిపారు.
రాజమౌళి విషయంలో కౌశల్ స్పందనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజమౌళి అభిమానులు కౌశల్ సపోర్టుగా నిలుస్తున్నారు. మిగితావాళ్లంతా కూడా సినిమా వాళ్లలై ఉండి కూడా.. రాజమౌళి బాబు గోనినేని చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ కాకపోవడంపై నెటిజర్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక, రాజమౌళి అభిమానుల సపోర్టు కోసమే కౌశల్ అలాంటి వ్యాఖ్యలు చేశాడని బాబు గోగినేని అనడం కొసమెరుపు. మొత్తానికి.. ఈ ఏపీ సోడ్ కౌశల్ కు మైలేజీ తెచ్చేలా.. బాబు గోనినేని ఇమేజ్ పోగోట్టేలా ఉందని చెప్పవచ్చు