తెలంగాణ గోడు వినిపించిన కేకే
తెలుగు రాష్ట్రం ‘ఆంధ్రప్రదేష్ ప్రత్యేక హోదా’ అంశంపై జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. విభజన హామీలపై కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడం.. అది చర్చకు రావడం జరిగింది. చర్చ ముగిసినా టీడీపీ ఎంపీలు నిరసనని కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ పాత పాటే పాడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునే ప్రత్యేక ప్యాకేజీని అడిగారునే పాయింట్ ని హైలైట్ చేయాలని చూస్తోంది. ఈ విషయం పక్కన పెడితే.. సభలో తెలంగాణ గోడు వినిపించారు టీఆర్ ఎస్ ఎంపీ కె. కేశవరావు.
ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలనే తాము కూడా కోరుతున్నాం. విభజనతో ఏపీతో పాటు తెలంగాణ నష్టపోయింది. రాష్ట్ర విభజన వల్ల సీలేరు పవర్ ప్రాజెక్టు ఏపీకి వెళ్లి పోయింది. దీంతో తాము కరెంటు కష్టాలను ఎదుర్కొన్నాం. తెలంగాణకు 4 వేల మెగావాట్ల విద్యుత్ ను ఇస్తామని చెప్పిన కేంద్రం కేవలం 1600 మెగావాట్లు మాత్రమే ఇచ్చారు అని కేకే ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలన్నింటీనీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.