ఆ ‘ఆలింగనం’ వెనక మూడు నెలల ప్లాన్.. !

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోడీని ఆలింగనం చేసుకోవడం హైలైట్ అయిన సంగతి తెలిసిందే. కేంద్రంపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొంది. రాహుల్ చర్యతో ప్రధాని ఒకింత షాక్ కి గురయ్యారు. ఆ వెంటనే తేరుకొని రాహుల్ భుజం తట్టారు. ఆ మరుసటి రోజు పత్రికల్లో ఈ సీన్ పతాకశ్రీర్షికల్లో వచ్చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజర్స్ ఆసక్తికరంగా స్పందించారు కూడా.

ఐతే, ఈ ఆలింగనం వెనక రాహుల్ గాంధీ పెద్ద కసరత్తు చేశాడన్న విషయం తాజాగా బయటికొచ్చింది. దేశ ప్రజల దృష్టిలో పడేందుకు సభలో ఏమైనా చేయాలి. అందులో ప్రధానిని భాగస్వామ్యం చేయాలని రాహుల్ అనుకొన్నారంట. అందులో భాగంగానే ప్రధానిని ఆలింగనం చేసుకొన్నాడు. దీనికోసం పక్కా టైమింగ్ ని ఫాలో అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ప్రధాని మాట్లాడే సమయంలోనో లేదా తన ప్రసంగం మధ్యలోనో ఈ కౌగిలింతను ఇవ్వాలని రాహుల్ భావించారట. కానీ, చివరకు తన ప్రసంగం ముగిసిన తరువాతే సరైన సమయమన్న రాహుల్ భావించినట్టు చెప్పుకొంటున్నారు.